Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంహార్వర్డ్‌ యూనివర్సిటీకి ఫెడరల్‌ నిధులు నిలిపివేత‌

హార్వర్డ్‌ యూనివర్సిటీకి ఫెడరల్‌ నిధులు నిలిపివేత‌

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: హార్వర్డ్‌ యూనివర్సిటీకి అందించే ఫెడరల్‌ నిధులను నిలిపివేస్తున్నట్లు ట్రంప్ సర్కారు ప్రకటించింది. యూనివర్సిటీపై కొన్ని విధానపరమైన మార్పులు తీసుకురావాలని సూచించినప్పటికీ.. దానికి ఒప్పుకోకపోవడంతోనే ఈ చర్యలు చేపట్టినట్లు విద్యాశాఖ మంత్రి లిండా మెక్ మాస్ ప్రకటించారు. బడ్జెట్, పన్ను మినహాయింపుల్లో కోతలు విధిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ డిమాండ్లను నెరవేర్చే వరకు హార్వర్డ్‌కు ఎటువంటి కొత్త గ్రాంట్లు మంజూరుచేయమని స్పష్టం చేశారు. ఫెడరల్ పరిశోధన గ్రాంట్లకు మాత్రమే ఈ నిషేధం వర్తిస్తుందని.. యూనివర్సిటీ ట్యూషన్‌ ఫీజులను చెల్లించడానికి విద్యార్థులకు సహాయపడే ఫెడరల్ ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం కొనసాగిస్తుందని మెక్ మాస్ పేర్కొన్నారు. కొత్త గ్రాంట్లకు అర్హత పొందుందకు హార్వర్డ్ యూనివర్సిటీ ఫెడరల్ ప్రభుత్వంతో చర్చలు జరపాల్సి ఉంటుందని అన్నారు. మ‌రోవైపుఈ చ‌ర్య‌ల‌పై హార్వర్డ్ అధ్యక్షుడు అలాన్ గార్బర్ స్పందించారు. ప్రభుత్వం చేసే చట్టవిరుద్ధమైన డిమాండ్లను పాటించడానికి నిరాకరించడంతోనే ఈ చర్యలు చేపట్టిందని, ప్రభుత్వం తమను ఎన్నిరకాలుగా అణచివేయడానికి ప్రయత్నించినా పోరాడుతూనే ఉంటామని హార్వర్డ్ అధ్యక్షుడు అలాన్ గార్బర్ అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad