- Advertisement -
– ₹40 వేల ఆర్థిక సహాయం
నవతెలంగాణ-కట్టంగూర్ : ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మండల కేంద్రానికి చెందిన డ్రైవర్ కారింగ్ శ్రీకాంత్ కుటుంబానికి తోటి డ్రైవర్లు చేయూతనందించారు. ఈ మేరకు వారు సేకరించిన ₹40వేల ను శ్రీకాంత్ తల్లి సైదమ్మకు అందజేసి తమ వితరణను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో కట్టంగూరు మండల డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పెంజర్ల సైదులు, డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు పొడిచేటి లింగయ్యగౌడ్, ప్రధాన కార్యదర్శి షేక్ అక్బర్ సలీం, ఉపాధ్యక్షులు చిత్తలూరి సైదులు, చిక్కుల్ల లింగస్వామి, కమిటీ సభ్యులు చెరుకు రవి, బొల్లం వెంకన్న, నర్సింగ్ రమేష్, వీరమల్ల నాగేష్, పాలకూరి వెంకన్న, పొడిచేటి శేఖర్ ఉన్నారు.
- Advertisement -



