Sunday, February 22, 2026
E-PAPER
Homeక్రైమ్Accident: జూబ్లీహిల్స్ లో ఫెరారీ కారు భీభత్సం..

Accident: జూబ్లీహిల్స్ లో ఫెరారీ కారు భీభత్సం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఆదివారం ఓ ఫెరారీ స్పోర్ట్స్ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో ప్రయాణిస్తున్న ఈ కారు రోడ్ నెం. 45లో అదుపుతప్పి పక్క రోడ్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో పలు కార్లు, బైక్‌లను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటన సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నివాసానికి సమీపంలో చోటుచేసుకుంది. ప్రమాదం ధాటికి వాహనాలు నుజ్జునుజ్జవగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా రోడ్డుపై వాహనాలు అడ్డదిడ్డంగా పడిపోవడంతో రోడ్ నెం. 45లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే చర్యలు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -