Saturday, September 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పర్యావరణహితంగా పండుగలు జరుపుకోవాలి

పర్యావరణహితంగా పండుగలు జరుపుకోవాలి

- Advertisement -

– కోనాపూర్ ప్రధానోపాధ్యాయులు రాంప్రసాద్   
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
రాబోవు దసరా, దీపావళి పండుగలను  పర్యావరణహితంగా జరుపుకోవాలని మండలంలోని కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చౌడారపు రాంప్రసాద్ అన్నారు. శనివారం పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో తల్లిదండ్రులకు, విద్యార్థులకు పర్యావరణానికి సంబంధించిన పలు అంశాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు రాంప్రసాద్ మాట్లాడుతూ సెలవులలో బతుకమ్మ కోసం వివిధ  రకాల పువ్వులు, ఆకులు సేకరించినప్పుడు వాటి యొక్క శాస్త్రీయ నామాలు కూడా ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలన్నారు. వాటన్నింటిని సేకరించి  ఆల్బమ్ తయారు చేయాలని సూచించారు.

వర్షాకాలం కావడంతో కుంటలు, చెరువులు, వాగుల దగ్గరకు వెళ్ళినప్పుడు పెద్దల పర్యవేక్షణలో మాత్రమే వెళ్లాలన్నారు. మైనర్ బాలురు వాహనాలు నడపవద్దని తెలిపారు. సెలవుల తర్వాత యస్ఏ పరీక్షలు ఉన్నందున పదవతరగతి విద్యార్థులు ప్రతిరోజు కనీసం మూడు గంటలు, మిగతా తరగతుల విద్యార్థులు కనీసం ఒక గంట పాటు చదువుకునే విధంగా చూడాలని తల్లిదండ్రులను కోరారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ధర్మేందర్, భాస్కర్, అరవింద్, గీత, హిమవతి, రామకృష్ణ, రాజరాజేశ్వరీ, కోనాపూర్, వాసన గట్టు తండా, కొత్తచెరువు తండా గ్రామాల నుండి హాజరైన తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -