నవతెలంగాణ-హైదరాబాద్: మరోసారి తాలిబన్లు, పాకిస్థాన్ దళాల మధ్య కాల్పలు జరిగాయి. ఇరుదేశాల సరిహద్దులో ఉన్న స్పిన్ బోల్డాక్‌లో రెండు సైన్యాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ రోజు ఉదయంతెల్లవారుజాము నుంచే సమయంలో స్పిన్ బోల్డాక్ ప్రాంతంలో పాకిస్థాన్ దళాలు, ఆఫ్ఘన్ తాలిబన్ల మధ్య భారీ పోరాటం జరిగింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. స్పిన్ బోల్డాక్ ఆఫ్ఘస్థాన్- పాకిస్థాన్ సరిహద్దులో ఉంది. ఇది ఉత్తరాన కాందహార్ నగరానికి, దక్షిణాన పాకిస్థాన్ నగరాలైన చమన్, క్వెట్టాకు హైవే ద్వారా అనుసంధానించబడి ఉంది. పశ్చిమ-చమన్ సరిహద్దు క్రాసింగ్ నగరానికి ఆగ్నేయంగా ఉంది.
పాకిస్థాన్ సైనికులతో ఘర్షణ జరిగిన 15 నిమిషాల్లోనే.. తాలిబన్లు పాకిస్థానీలను లొంగిపోయేలా చేశాం.. ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని ఆఫ్ఘన్ తాలిబన్ పేర్కొంది. అనేక ఇళ్ళు ధ్వంసమయ్యాయి. డ్యూరాండ్ లైన్ వెంబడి ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడానికి పాకిస్థాన్ దళాలు భారీ ఆయుధాలు, వైమానిక శక్తిని ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఇరువైపులా ఇంకా అధికారిక ప్రకటనలు జారీ కాలేదు” అని ఆఫ్ఘస్థాన్ జాతీయ భద్రతా మండలి సభ్యుడు కబీర్ హక్మల్ అన్నారు.