- Advertisement -
నవతెలంగాణ-నిజాంసాగర్
మండల కేంద్రంలోని నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా లక్ష 25 వేల ఎకరాల యాసంగి పంటల సాగు కోసం ఐదవ విడత నీటిని 1200 క్యూసెక్కుల చొప్పున శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుండి నుండి పదిహేను రోజుల పాటు అలీ సాగర్ కు వదులుతున్నట్లు ప్రాజెక్ట్ ఏ ఈ ఈ సాకేత్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కావున కాలువ పరివాహక ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాలువలోకి ఎవరు దిగొద్దని ఆయన సూచించారు.ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 17.802 టీఎంసీల నీటికి గాను ప్రస్తుతానికి ప్రాజెక్టులో 10.338 టీఎంసీల నీరు నిలువ ఉంది.
- Advertisement -



