Sunday, October 5, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంనాలుగు రోజుల పాటు భార‌త్‌లో ఫిజి ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌

నాలుగు రోజుల పాటు భార‌త్‌లో ఫిజి ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: నాలుగు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రిప‌బ్లిక్ ఆఫ్ ఫిజి దేశ ప్ర‌ధాని సితివేని లింగమంటా రాబుక భార‌త్ కు చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఆయ‌న‌కు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ స్వాగతం పలికారు. ఆగస్టు 24 నుండి 27 వరకు ఆయ‌న స‌తిమ‌ణి సులువేటి రబుకతో కలిసి భార‌త్‌ను సంద‌ర్శించినున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయన క్యాబినెట్ మంత్రితో సమావేశం అవుతారు. ఆగస్టు 25న, రబుక హైదరాబాద్ హౌస్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని క‌లువ‌నున్నారు. ఆ తర్వాత ఆయన రాష్ట్రపతి భవన్‌లో అధ్యక్షురాలు ద్రౌపది ముర్మును కలుస్తారు. ఆగస్టు 26న, ఫిజియన్ నాయకుడు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ నిర్వహించే సప్రూ హౌస్‌లో ఉపన్యాసం ఇవ్వ‌నున్నారు. ఆగస్టు 27న ఆయన ఢిల్లీ నుండి బయలుదేరడంతో ఫిజి ప్ర‌ధాని పర్యటన ముగుస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -