Sunday, October 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామ పంచాయతి ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులుగా గణపతి రెడ్డి

గ్రామ పంచాయతి ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులుగా గణపతి రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – వలిగొండ రూరల్
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఐదవ రాష్ట్ర మహాసభలు మహబూబాద్ జిల్లాలో గార్ల మండలంలో నిర్వహించడం జరిగింది. ఈ మహాసభల్లో గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులుగా ఫైళ్ళ గణపతి రెడ్డి  ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గణపతి రెడ్డి మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా గ్రామపంచాయతీ కారోబారుగా పులిగిల్ల గ్రామంలో వలిగొండ మండలంలోని యాదాద్రి భువనగిరి జిల్లా లో పనిచేస్తున్న నాకు గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులుగా గుర్తించినందున గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల కోసం భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా పోరాటాల నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా గ్రామపంచాయతీ సిబ్బంది బకాయి వేతనాలు చెల్లించాలి, వేతనాల బడ్జెట్ కేటాయించాలి, గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించేందుకు పోరాటాల నిర్వహిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులకు గుర్తింపు కార్డుల కోసం  కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం అందుబాటులో ఉండి పనిచేస్తానన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -