Thursday, January 29, 2026
E-PAPER
Homeజాతీయంఆర్థిక స‌ర్వేను పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్టిన ఆర్థిక మంత్రి

ఆర్థిక స‌ర్వేను పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్టిన ఆర్థిక మంత్రి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ పార్ల‌మెంట్ లో వార్షిక ఆర్థిక స‌ర్వేను ప్ర‌వేశ‌పెట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26)లో భారత వృద్ధి 7 శాతం ఉండవచ్చని సర్వే అంచనా వేసింది. అదే విధంగా వ‌చ్చే ఫైనాన్షియ‌ల్ ఇయ‌ర్ కూడా 6.08నుంచి 7.2శాతం మ‌ధ్య‌లో వృద్ధి రేటు ఉంటుంద‌ని కేంద్ర ఆర్థిక మంత్రి ఆర్థిక స‌ర్వేలో పేర్కొన్నారు.

2047 నాటికి వికసిత్ భారత్ (Vikasit Bharat) లక్ష్యాన్ని చేరుకోవాలంటే, వచ్చే రెండు దశాబ్దాల పాటు నిలకడగా 8 శాతం వృద్ధి రేటును సాధించాల్సిన అవసరం ఉంది. కృత్రిమ మేధ (AI), రోబోటిక్స్, బయోటెక్నాలజీ రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులు పెరగాలని సర్వే నొక్కి చెప్పింది. గత ఐదేళ్లలో నేషనల్ హైవేలు, రైల్వే నెట్‌వర్క్ విస్తరణ ద్వారా మౌలిక సదుపాయాల కల్పనలో గణనీయమైన ప్రగతి నమోదైందని నిర్మలా ఆర్థిక సర్వే బహర్గతం చేసింది.

ఫిబ్ర‌వ‌రి 1న కేంద్ర ఆర్థిక మంత్రి వార్షిక బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. ఈ సారి సెల‌వు దిన‌మైన ఆదివారం నాడు బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌డం విశేషం. అదే విధంగా వ‌రుస‌గా 9సార్లు బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన మ‌హిళ ఆర్థిక‌మంత్రిగా రికార్డును కైవ‌సం చేసుకున్నారు. అధికంగా వార్షిక బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన ఘ‌న‌త మొరార్జీ దేశాయ్ పేరు మీద ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -