- Advertisement -
– మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దికుంట నర్సగౌడ్
నవతెలంగాణ-రామారెడ్డి : మండలంలోని రెడ్డి పేట గ్రామానికి చెందిన మామిండ్ల నర్సింలు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో , ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దికుంట నర్స గౌడ్ స్పందించి పరామర్శించి, రూ 3000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మండలంలోని రెడ్డి పేట, మద్దికుంట, అన్నారం తో పాటు పలు తాండాలో గణేష్ మండపాలకు 200 లడ్డూలను అందజేశారు. కార్యక్రమంలో కుమ్మరి శంకర్, కోక బాలయ్య, ఎస్కే కాసిం, సురేందర్ రెడ్డి, ఆంజనేయులు, మహేష్, సతీష్, బాల నరసింహ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -