పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

నవతెలంగాణ –  కమ్మర్ పల్లి 
వేల్పూర్ మండలం కోమన్ పల్లి గ్రామానికి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు దుమ్మల గంగారం ఇటీవల గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ దృష్టికి తీసుకురావడంతో ఆ పేద కుటుంబానికి ముత్యాల సునీల్ కుమార్ రూ. 10వేల ఆర్థిక సహాయాన్ని పంపించారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ మండల  నాయకులు ఆ ఆర్థిక సహాయాన్ని మృతుడి  కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆర్థిక సహాయం అందజేసిన ముత్యాల సునీల్ కుమార్ కు మృతుడి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గడ్డం నర్సారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి  దామోదర్ గౌడ్, గ్రామ శాఖ అద్యక్షులు నారాయణ, మండల ఎస్సి సెల్ అద్యక్షులు ప్రవీణ్, చరణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు  పాల్గొన్నారు.
Spread the love