- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నాంపల్లి FSL కార్యాలయంలో అగ్ని ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేశారు. ఫోరెన్సిక్ ల్యాబరేటరీకి సంబంధించిన ప్రాపర్టీకి ఎలాంటి నష్టం జరగలేదని ఫోరెన్సిక్ DG షికా గోయల్ తెలిపారు. కీలక కేసుల ఆధారాలు ధ్వంసం అయ్యాయన్న వార్తలను ఖండించారు. సీజ్ చేసిన ప్రాపర్టీ కొంతమేర మాత్రమే కాలిపోయిందని వెల్లడించారు. కాగా షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
- Advertisement -



