- Advertisement -
నవతెలంగాణ అమీర్ పేట్: అమీర్ పేట్ పిల్లర్ నంబర్ 1444 వద్ద బాలాజీ నెయ్యి దుకాణంలో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు ఎగిసిపడడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి.
స్థానికులు భయాందోళనకు గురవగా, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రమాదంతో అమీర్ పేట్ లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
- Advertisement -