- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీలోని పాలెం ప్రాంతంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు సజీవదహనమయ్యారు. వారంతా ఒకే కుటుంబ సభ్యులు. ఓ బహుళ అంతస్తుల భవనంలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
- Advertisement -



