Friday, December 26, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకాచిగూడలో అగ్ని ప్రమాదం..చిన్నారి మృతి

కాచిగూడలో అగ్ని ప్రమాదం..చిన్నారి మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్‌లోని కాచిగూడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కాచిగూడలోని ఓ ఇంట్లోని ఏసీలో షార్ట్ సర్క్యూట్‌ జరిగింది. దీంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ఆ సమయంలో ఇంట్లో ఇద్దరు చిన్నారులు ఉండగా.. ఒకరు ఊపిరాడక అక్కడిక్కడే మృతిచెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఫైరింజన్ల సాయంతో వచ్చి మంటలు అదుపుచేశారు. అనంతరం కేసు నమోదు చేసుకున్నారు. షార్ట్ సర్క్యూట్‌కు సంబంధించిన కారణాలపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -