నవతెలంగాణ-హైదరాబాద్ : భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న ఘటన మహారాష్ట్రలో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భీవండీలోని ఓ డెకరేషన్ గోడౌన్‌లో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అసలే వేసవి కాలం కావడంతో ఆ మంటలు కాస్త భారీగా ఎగసిపడి పక్కనే ఉన్న మరో నాలుగు గోడౌన్లకు వ్యాపించారు. దీంతో ఆ గోడౌన్లలో ఉన్న మెటీరియల్ పూర్తిగా కాలి బూడిదైంది. ఈ దుర్ఘటనలో ప్రాణ నష్టంపై ఎలాంటి సమాచారం రాలేదు. అయితే, కాలిపోయిన మెటీరియల్ విలువ రూ.కోట్లలో ఉంటుందని యజమానులు పేర్కొన్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మొత్తం ఐదు ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.