Tuesday, May 6, 2025
Homeతాజా వార్తలునాగోల్ లో భారీ అగ్నిప్రమాదం..

నాగోల్ లో భారీ అగ్నిప్రమాదం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ లోని నాగోల్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.. మంగళవారం నాగోల్ లోని సాయినగర్ కాలనీలో ఉన్న గుడిసెలలో జరిగింది. పూర్తి వివరలోకి వెలితే.. ఓ ఇంట్లో గ్యాస్ లీక్ అవ్వడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మంటలు భారీగా ఎగసి పడి.. పక్క ఇంటికి కూడా అంటుకున్నాయని స్థానికులు తెలిపారు. అగ్ని ప్రమాదదాటికి ఇండ్లలో గ్యాస్ బండలు పేలుతూ ఆందోళనకు గురి చేస్తున్నాయి. స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు. ప్రమాద సమయంలో గుడిసెల దగ్గర దట్టమైన పొగ అలుముకుంది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. 13 ఏళ్ళ కిందట ఇదే ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఎండాకాలంలో గుడిసెల్లో ఉండేవారు అప్రమత్తంగా ఉండాలని.. గ్యాస్ లీకేజి లేకుండా చూసుకోవాలని అధికారులు సూచించారు. వంట వండే సమయంలో తగినంత వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలని అధికారులు సూచించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -