Friday, January 9, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపూరీ - తిరుపతి రైలులో అగ్నిప్రమాదం..

పూరీ – తిరుపతి రైలులో అగ్నిప్రమాదం..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : పూరీ – తిరుపతి రైలులో మంటలు చెలరేగాయి. తుని – అన్నవరం మధ్య గురువారం ఉదయం 6 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బోగీలో విద్యుత్ ప్యానల్ బోర్డు వద్ద దుప్పట్లకు మంటలు అంటుకోవడం ప్రమాదానికి దారితీసింది. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది.. మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. ఈ ప్రమాదంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. కాగా.. రైలులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని రైల్వే సిబ్బంది తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -