నవతెలంగాణ-హైదరాబాద్ : సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్యాట్నీ సెంటర్‌లోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ బిల్డింగ్ ఐదో అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ మంటలు బిల్డింగ్ అంతటా వ్యాపించడంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్ వాసులు , స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షాట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. విలువైన ఫైల్స్ దగ్దమైనట్లు సమాచారం. ఆదివారం సెలవు రోజై ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ప్యాట్నీ సెంటర్ ఎస్బీఐ బ్యాంకులో భారీ అగ్నిప్రమాదం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES