- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్యలో శనివారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మహా యజ్ఞశాలలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సరయూ నది తీరాన జమ్తారా ఘాట్ వద్ద నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీనారాయణ మహాయజ్ఞంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో యూపీ రవాణా మంత్రి దయాశంకర్ సింగ్ సహా పలువురు ఉన్నతాధికారులు అక్కడే ఉన్నారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



