- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్ కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. సూర్య ఎంటర్ ప్రైజెస్ ఆలు చిప్స్ గోదాములో ఈ తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. నివాస ప్రాంతాల్లో గోదాము ఉండటంతో కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని రెండు ఫైరింజన్లతో మంటలు ఆర్పివేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -