- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : గుజరాత్‌లోని పోరుబందర్ వద్ద సముద్రం తీరంలో ఓ వాణిజ్య నౌకలో అగ్నిప్రమాదం జరిగింది. గుజరాత్ నుంచి సోమాలియాకు చక్కెర, బియ్యం తరలిస్తుండగా మార్గమధ్యలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. ఈ నౌకను జామ్‌నగర్‌లోని ‘హెఆర్‌ఎం అండ్ సన్స్’ సంస్థకు చెందినదిగా గుర్తించారు.
- Advertisement -