Friday, February 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలునల్లమలలో కార్చిచ్చు..ఎగిసి పడుతున్న మంటలు

నల్లమలలో కార్చిచ్చు..ఎగిసి పడుతున్న మంటలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : నల్లమలలో కార్చిచ్చు రాజుకున్నది. నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం తాటిగుండాల, బ్రహ్మగిరి సెక్షన్‌ పరిధిలోని మూడు ప్రాంతాల్లో 30 హెక్టార్లలో నిప్పు రాజుకున్నది. ఎండల తీవ్రతతో పొడిగడ్డి వేగంగా రాళ్లకు రాజుకొని మంటలు వ్యాపించాయి. బుధవారం ప్రారంభమైన మంటలను అటవీ శాఖ పైర వాచర్లు, బేస్‌ క్యాంప్‌ సిబ్బంది రాత్రి వరకు అతికష్టం మీద ఆర్పారు. తిరిగి గురువారం ఉదయం మళ్లీ వ్యాపించడంతో బ్రహ్మగిరి రేంజ్‌ అధికారి గురుప్రసాద్‌ ఆధ్వర్యంలో సిబ్బంది చేరుకొని ఫైర్‌ లోయర్ల ద్వారా మంటలను అదుపు చేశారు.

అయినప్పటికి శుక్రవారం వరకు మంటలు అదుపులోకి రాలేదు. బ్రహ్మగిరి రేంజ్‌లోని వజ్రాల మడుగు అవిసి పెంట సమీపంలో మంటలు రెండు రోజులుగా ఎగిసి పడుతున్నాయి. మంటలు అదుపులోకి రాకపోవడంతో వందల హెక్టార్ల అటవీ సంపద, వన్యప్రాణుల ఆవాసాలు బూడిదయ్యాయి. అటవీ సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -