– షార్ట్ సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు
నవతెలంగాణ- మేడ్చల్
సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండమైలారం నుంచి కొంపల్లికి వెళ్తున్న ఓ ప్రయివేటు బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు మేడ్చల్ ఐటీఐ వద్దకు రాగానే మంటలు వచ్చాయి. దాంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును పక్కకు ఆపి కిందకు దిగిపోయాడు. క్షణాలో బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. బస్సు అప్పటికే పూర్తిగా దగ్ధమైంది. బస్సులో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వచ్చినట్టు డ్రైవర్ తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రయివేటు బస్సులో దగ్ధం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES