Sunday, August 10, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంగరీబ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు

గరీబ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు

- Advertisement -

జైపూర్‌ : రైల్వే భద్రత పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన కారణంగా పదేపదే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. శనివారం రాజస్థాన్‌ రాష్ట్రం అజ్మేర్‌ రైల్వే డివిజన్‌లోని సెంద్రస్టేషన్‌లో గరీబ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఇంజిన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. రైలు భోగీల్లో పొగలు వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img