Monday, March 16, 2026
E-PAPER
Homeతాజా వార్తలువిశాఖలో బాణసంచా పేలుడు..

విశాఖలో బాణసంచా పేలుడు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : విశాఖపట్నంలోని ఓ ఇంట్లో ఆదివారం అనధికార బాణసంచా నిల్వలు పేలి మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి కొన్ని ఇళ్ల గోడలు, శ్లాబ్‌లు దెబ్బతిన్నాయి. జీవీఎంసీ 89వ వార్డు మహాత్మా ఆదర్శనగర్‌కు చెందిన డి.శివకృష్ణకుమార్‌ ఎలియాస్‌ బాంబుల శివ(40) స్థానిక శ్మశానవాటిక సమీపంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. అందులో అనధికారికంగా బాణసంచా తయారు చేస్తూ విక్రయిస్తున్నాడు. ఈ నెల 18న ఉత్సవాలు ఉండడంతో పెద్దఎత్తున మందుగుండు సామగ్రి నిల్వచేశాడు. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో భవనంలో నుంచి దట్టమైన పొగ, మంటలు వచ్చి, వెంటనే పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల ధాటికి ఇంటిగోడలు ముక్కలై, పక్కనే ఉన్న రేకులషెడ్ల పైకప్పులపై పడ్డాయి. సమీపంలోని ఇళ్లగోడలూ పగుళ్లిచ్చాయి. ఇంట్లో వస్తువులు, ద్విచక్ర వాహనం ధ్వంసమయ్యాయి. ఓ మహిళకు శ్లాబ్‌ పెచ్చులు తగిలి స్వల్పగాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించారు. పేలుళ్ల శబ్దం మూడు కిలోమీటర్ల వరకూ వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాణసంచా నిల్వచేసిన బాంబుల శివ పరారయ్యాడు. మర్రిపాలెం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. సీఐ సన్యాసినాయుడు ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -