Saturday, March 21, 2026
E-PAPER
Homeజాతీయంబాణాసంచా పేలుడు ఘటన.. జగన్ దిగ్భ్రాంతి

బాణాసంచా పేలుడు ఘటన.. జగన్ దిగ్భ్రాంతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో చోటుచేసుకున్న భారీ పేలుడు ఘటనపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా తన విచారాన్ని తెలియజేశారు. ప్రమాదంలో కార్మికులు మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇటువంటి విషాద సమయంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -