నవతెలంగాణ-హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు (NC chief) ఫరూఖ్ అబ్దుల్లా (Farooq Abdullah) పై బుధవారం కాల్పుల ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఓ పెళ్లి వేడుకలో పాల్గొని, వేదిక నుంచి తిరిగి వస్తుండగా జమ్ములోని పురాని మండి ప్రాంతానికి చెందిన కమల్ సింగ్ జమ్వాల్ కాల్పులకు తెగబడ్డాయి. భద్రతా సిబ్బంది అప్రమత్తతో ఆయనకు తృటిలో ప్రాణాపాయం తప్పింది.
ఘటనా స్థలంలోనే దుండగుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తు సందర్భంగా నిందితుడు.. తాను 20 ఏళ్లుగా ఫరూఖ్ అబ్దుల్లాను చంపాలని చూస్తున్నానని చెప్పినట్లు వెల్లడించారు. తన వ్యక్తిగత కారణం మేరకు ఈ దాడికి పాల్పడ్డానని చెప్పారు.



