- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: నటుడు ఫిష్ వెంకట్ (53) శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన తన నటన, డైలాగులతో అభిమానులను సంపాదించుకున్నారు. చిత్ర పరిశ్రమలో పెద్దపెద్ద హీరోలతో ఆయన నటించి, ప్రేక్షకులను మెప్పించారు. కానీ ఆయన చనిపోతే కొందరు చిన్న ఆర్టిస్టులు మినహా ఏ పెద్ద నటుడు, దర్శకుడు కూడా ఆయన భౌతికదేహాన్ని చూసేందుకు రాకపోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. కనీసం సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో కూడా ట్వీట్ చేయలేదు.
- Advertisement -