Monday, February 2, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంబంగ్లాదేశ్ చెర నుంచి మత్స్యకారులు విడుద‌ల‌

బంగ్లాదేశ్ చెర నుంచి మత్స్యకారులు విడుద‌ల‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: సముద్రంలో వేటకు వెళ్లి బంగ్లాదేశ్‌ తీర ప్రాంతంలో పొరపాటున ప్రవేశించి గత ఏడాది అక్టోబర్‌ లో అరెస్ట్‌ కాబడి, దాదాపు నాలుగు మాసాల పాటు బంగ్లాదేశ్‌ జైలులో ఉన్న 9 మంది మత్స్యకారులు విడుదలయ్యారు. సోమవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో స్థానిక ఫిషింగ్‌ హార్బర్‌ కు వీరంతా చేరుకున్నారు. ఈ మత్స్యకారులంతా విజయనగరం జిల్లాకు చెందినవారు. ఆర్డివో ఎస్‌.సుధాకర్‌, ఫిషరీస్‌ డిపార్ట్మెంట్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ఎస్‌. లక్ష్మణరావు, ఎపి మేకనైజ్డ్‌ బోటు అసోసియేషన్‌ అధ్యక్షులు మైలపల్లి లక్ష్మణరావు, చీకటి రమేష్‌, గరికిన రవి, తదితరులు కలిసి తీర ప్రాంతానికి చేరుకున్న మత్స్యకారులకు స్వాగతం పలికి వారందరికీ స్వీట్లు పంపిణీ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -