నవతెలంగాణ – తంగళ్ళపల్లి
తంగళ్ళపల్లి మండలంలోని అన్ని ప్రాథమిక పాఠశాలల ఎల్ ఎఫ్ ఎల్ ఉపాధ్యాయులు, సెకండరీ గ్రేడ్ టీచర్ ఉపాధ్యాయులకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ఎంఈఓ భూక్య రాజు నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ శిక్షణ కార్యక్రమం ఐదు రోజులు ఉంటుందని ప్రతి ఉపాధ్యాయులు ఉదయం 9:30 నిమిషాలకు చెక్ ఇన్ కావాలని, సాయంత్రం ఐదు గంటలకు చెక్ అవుట్ కావాలన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో , ఫ్యూచర్ జియో టెస్ట్ తప్పనిసరి అని అన్నారు. ఈ శిక్షణలో ఆర్పీలు చెప్పే అంశాలన్నీ ప్రతి ఉపాధ్యాయులు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపే చేస్తూ, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఉపాధ్యాయ విద్యాబోధన ఎంతో ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్పిలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయులకు ఐదు రోజుల శిక్షణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES