Thursday, December 11, 2025
E-PAPER
Homeక్రైమ్ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : యూపీలోని బారాబంకి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై రెండు కార్లు ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో తల్లి, నలుగురు పిల్లలో ఉన్నారు. ఇదే ఘటనలో మరో ఐదుగురు గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. ఆజంగఢ్‌లో విధులు నిర్వరిస్తున్న వారణాసికి చెందిన కానిస్టేబుల్‌ జావెద్‌ అష్రఫ్‌ భార్య, ముగ్గురు కూతుళ్లు, కొడుకు మృతి చెందారు. ఈ ఘటనలో పలువురు గాయపడగా వారిని బారాబంకి ఎస్పీ అర్జిత విజయ వర్గియా పేర్కొన్నారు. కారును జావెద్‌ బావమరిది నడుపుతున్నాడని.. పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై కొద్దిసేపు ఆపగా.. ఇదే సమయంలో ఆజంగఢ్ నుంచి వస్తున్న బ్రెజ్జా కారు వెనుక నుంచి ఢీకొట్టింది.

దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. యూపీడీఏ బృందాలు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రమాదంలో వ్యాగనార్‌ కారులోని సీఎన్‌జీ సిలిండర్‌ పేలడంతోనే మంటలు చెలరేగి ఉంటాయని అనుమానిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వ్యాగనర్‌ కారు రోడ్డుపై ఆపి సర్వీస్‌ రోడ్డుపై స్నాక్స్‌ తీసుకుంటున్నారు. ఈ సమయంలో నలుగురు కారులోనే ఉన్నారు. వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఆ తర్వాత వెంటనే మంటలు చెలరేగాయని తెలిపారు. బ్రెజ్జా కారులో ఉన్న వారిని ఢిల్లీలోని సౌత్‌పురికి చెందిన దీపాంశుతో పాటు నలుగురు ఉండగా.. వారిని బయటకు తీశారు. పోలీసులు వచ్చే సరికి వ్యాగనర్‌ కారు మంటల్లో కూలిపోయింది. జిల్లా మేజిస్ట్రేట్ శశాంక్ త్రిపాఠి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అర్పిత విజయవర్గీయ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని విచారణకు ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -