- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: వాయువ్య ఢిల్లీ ఆదర్శ్ నగరలోని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ క్వార్టర్స్ (డిఎంఆర్‌సి) ఐదో అంతస్తులో మంగళవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో ఓ కుటుంబం మొత్తం సజీవ దహనమైంది. మృతి చెందిన వారు అజరు కుమార్ (42), ఆయన భార్య నీలం (38), కుమార్తె జాహ్నవి (10)గా గుర్తించినట్లు ఢిల్లీ అగ్నిమాపక సేవల అధికారి తెలిపారు. సమాచారం అందిన వెంటనే మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ఐదు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని అగ్నిమాపక అధికారి వెల్లడించారు.
- Advertisement -



