Monday, May 5, 2025
Homeజాతీయంభారీ అగ్నిప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ దహనం

భారీ అగ్నిప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ దహనం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి కాన్పూర్‌లోని చమన్‌ గంజ్‌ ప్రాంతంలో ఉన్న ఓ నాలుగు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ దహనమయ్యారు. బిల్డింగ్‌లోని మొదటి అంతస్తుల్లో ఫుట్‌వేర్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ఉన్నది. మిగిలిన రెండు అంతస్తుల్లో ఓ కుటుంబం నివసిస్తున్నది. ఆదివారం రాత్రి ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.
12 ఫైరింజన్లతో తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. మూడో అంతస్తుతో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయని ఏసీపీ తేజ్‌ బహదూర్‌ సింగ్‌ చెప్పారు. పిల్లల బెడ్‌ రూమ్‌లు నాలుగో అంతస్తులో ఉన్నాయని, సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు ఎడీఆర్‌ఎఫ్‌ సిబ్బంది వారిని రక్షించారని తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం దవాఖానకు తరలించామని చెప్పారు. అయితే పూర్తిగా కాలిపోవడంతో వారు కూడా మరణించారని చెప్పారు. మృతులను డానిష్‌ (45) అతని భార్య నజ్మీ సాబాగా గుర్తించామన్నారు. అతని ముగ్గురు పిల్లలు కూడా మరణిచారని వెల్లడించారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని, ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -