Sunday, May 4, 2025
Homeక్రైమ్ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు దుర్మరణం

ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు దుర్మరణం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : రోడ్డు ప్రమాదంలో ఐదుగురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బొలెరో వాహనంలో కొంతమంది కలిసి ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలోనే వారి బొలెరో ఆత్మకూరు మండల పరిధిలోని బైర్లూటి సమీపంలోకి రాగానే అతివేగంతో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ దుర్ఘటనలో మొత్తం ఐదుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పో్యారు. మరో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఏడుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ మేరకు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమచారం ఇంకా తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -