నవతెలంగాణ-హైదరాబాద్: ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు పోలీసులు అధికారులు మృతి చెందిన సంఘటన ఆదివారం ఒడిశాలో చోటుచేసుకుంది. జోర్సుగూడ పీఎస్ పరిధిలోని నేషనల్ హైవే 49పై ఓ ట్రాలీ వాహనం, పోలీస్ జీప్ ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు అధికారులు అక్కడికక్కడే మరణించగా మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలైయ్యయని జార్సుగూడ పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) గుండాల రెడ్డి రాఘవేంద్ర చెప్పారు. బాధితులను చికిత్స కోసం ఉన్నత ఆస్పత్రికి తరలించామని చెప్పారు. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం ఎనిమిది ఉన్నారని, వివాహ వేడుక నుండి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సుమారు తెల్లవారుజామున నాలుగు గంటలకు జరిగిందని ఎస్పీ పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపడుతున్నామన్నారు.
రోడ్డుప్రమాదంలో ఐదుగురు పోలీస్ అధికారులు దుర్మరణం
- Advertisement -
- Advertisement -



