నవతెలంగాణ – కంఠేశ్వర్
ప్రపంచ కార్మిక దినోత్సవ సందర్భంగా నాగారం గోశాల వద్ద సీపీఐ(ఎం) నగర కార్యదర్శి సుజాత జండా గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కార్మికులకు 139 ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికులను శ్రమ దోపిడీ చేస్తూ 20 గంటలు పని చేయించేవారన్నారు. ఆ కష్టాలు అమెరికా షికాగో నగరంలో కార్మికులు ఎదుర్కొన్నారు. బానిసత్వాన్ని తట్టుకోలేక 8 గంటల పని దినం కోసం కార్మికులు తిరుగుబాటు మొదలుపెట్టి సమ్మెలు చేసి, యజమాన్యానికి బుద్ధి చెప్పే క్రమంలో కార్మికుల ఐక్యత తట్టుకోలేక కార్మికులపై కాల్పులు జరిపిం. ఆ పోరాటాన్ని అణిచి వేయాలని ఎంతోమందిని కార్మికుల ప్రాణాల్ని పొట్టన పెట్టుకున్నారు. అయినా కార్మికులు వెనకడుగు వేయకుండా మేము చనిపోయినా రేపు భవిష్యత్తు తరాలకు ఫలితం దక్కాలని, వారి నెత్తుటి నుండి ఉన్నటువంటి ఎర్రజెండా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మేడే వేడుకలను జరుపుకుంటూ.. ఎప్పటికప్పుడు కార్మికుల సమస్యను పసిగడుతోందన్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటాలు నిర్వహిస్తూ ప్రజల్లో ఉంటున్నది సీపీఐ(ఎం). ప్రజా సమస్యల ఉన్నంతవరకు ప్రజల కోసం ఎర్రజెండా ఎప్పుడు వెన్నంటే ఉంటది అని ప్రజలకు హామీ ఇస్తోంది. మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనిమిది గంటల పని దినాన్ని 12 గంటలకు మార్చి షాపింగ్ మాల్ లలో, హాస్పటల్లో, అవుట్సోర్సింగ్ కార్మికుగా పనిచేస్తున్న అందరిపైనా శ్రమదోపిడి చేస్తూ నాలుగు లేబర్ కోట్లను రద్దుచేసి కార్మికుల హక్కులను కాల రాసింది. భవిష్యత్తులో కార్మికులకు వ్యతిరేకమైన చట్టాలు తీసుకురాకుండా పోరాటాలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి, రేఖ, లలిత, జమున, జ్యోతి, మాధవి, సత్యశీల, లక్ష్మి, సునీత, సంపత, ఫిరంగి భాయ్, శాలుబాయ్, రాణి, రేఖ భాయ్ తదితరులు పాల్గొన్నారు.
గోశాల వద్ద జెండావిష్కరణ..
- Advertisement -
RELATED ARTICLES