- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కాంగ్రెస్ నాయకులతో కలిసి జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సతీష్ పటేల్, స్థానిక కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, కే. కల్లాలి మాజీ సర్పంచ్ రమేష్ దేశాయి , మనోహర్ పటేల్ , కౌలాస్ మాజీ సర్పంచ్ గొల్ల హనుమాండ్లు క్యాంపు కార్యాలయ సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -