- Advertisement -
- – ఉత్సవాలకు హాజరైన బుసిరెడ్డి పాండన్న..
నవతెలంగాణ-పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం లింగంపల్లి గ్రామం లో బుధవారం శ్రీ సీతారామస్వామీ నూతన ఆలయం లో గ్రామస్తులు వేడుకలా ధ్వజస్థంభ ప్రతిష్ట ఉత్సవాలు వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛారణల మధ్య భక్తిజన సందోహంలో, ఆలయ ఉత్సవ కమిటీ వేడుకలా ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయంలో గణపతి పూజ, ప్రత్యేక హోమం, అభిషేకాలు నిర్వహించి భక్తులు సందడి చేశారు. గ్రామంలోని చిన్న,పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ప్రతిష్ట కార్యక్రమానికి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఉత్సవాలను తిలకించుటకు అనుముల, పెద్దవూర మండలాల నుండి భక్తులు భారీగా తరలి వచ్చారు. 05 గురు వేద పండితులు భక్తిశ్రద్ధలతో కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. నాగార్జున సాగర్ నియోజకవర్గం పేదల పెన్నిది బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ బుసిరెడ్డి పాండన్నా ఉత్సవాలకు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం కార్యక్రమం లో పాల్గొన్నారు.
- Advertisement -