నవతెలంగాణ-హైదరాబాద్: ఆకస్మిక వరదలకు పాకిస్థాన్ చిగురుటాకుల వణుకుతోంది. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతంలో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఒక్కసారిగా వరదలు సంభవించడంతో పర్యాటక వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయని ప్రాంతీయ ప్రభుత్వ ప్రతినిధి ఫైజుల్లా ఫరాక్ తెలిపారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని లోధ్రాన్‌కు చెందిన ఒక మహిళ మృతదేహంతో సహా ఇప్పటివరకు నాలుగు మృతదేహాలు బయటకు తీసినట్లు చెప్పారు. డజన్ల కొద్దీ కొట్టుకుపోయారని.. ఇక గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.
ఇక వరదల ధాటికి ఆదేశంలో రవాణా వ్యవస్థ భారీగా దెబ్బతింది. పలు చోట్ల రహదారులు వరదలకు కొట్టుకుపోయాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పలు ప్రాంతాల్లో అంధకారం అలుముకుంది. ఇక తాత్కాలిక ఆశ్రయాల్లో పర్యాటకులకు అధికారులు వసతి కల్పిస్తు్న్నారు. దాదాపు ఏడు కిలోమీటర్ల వరకు ఉన్న వాహనాలు కొట్టుకుపోయినట్లు సమాచారం.