– రెండు అంతర్జాతీయ విమాన సర్వీసుల దారి మళ్లింపు
– శంషాబాద్, ఆదిభట్ల పరిధిలో మాక్ డ్రిల్
నవతెలంగాణ-శంషాబాద్
జమ్ము కాశ్మీర్‌లోని పహల్గాం ఘటనకు ప్రతీకారంగా భారత్ జరిపిన ‘ఆపరేషన్ సింధూర్’ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా శంషా బాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. బుధవారం ఎయిర్‌పోర్టు నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన విమానాలను మధ్యాహ్నం 12 గంటల నుంచి రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. ప్రధానంగా జమ్ము, శ్రీనగర్, లేV్‌ా, జోద్పూర్, అమృత్‌సర్, బుజ్, జాంనగర్, ఛండీఘర్, రాజ్‌కోట్‌కు వెళ్లాల్సిన పలు విమానాలను రద్దు చేశారు. దీంతోపాటు రెండు అంతర్జాతీయ విమానాలను దారి మళ్లీంచారు.
శంషాబాద్‌లో మాక్ డ్రిల్
ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శంషాబాద్ జోన్ డీసీపీ రాజేష్ సూచించారు. ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ శంషాబాద్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో సాయంత్రం బస్‌స్టేషన్ ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉగ్రదాడి జరిగినప్పుడు ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంపై అవగాహన కల్పించారు. అలాగే ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బొంగ్లూర్ ఎక్స్ రోడ్డు, వండర్‌లా, రావిర్యాల, తుర్కయంజాల్‌లో ఆదిభట్ల పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహిం చారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ పరిధిలోని కిస్మత్‌పూర్ ప్రధాన చౌరస్తాతోపాటు పలు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానాలు రద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES