- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: మెక్సికో లో వరదలు బీభత్సం సృష్టించాయి. రుయిడోసోలో ఆకస్మిక వరదలు సంభవించాయి. వరద నీటి ప్రవాహానికి పలు ఇళ్లు కొట్టుకుపోయాయి . ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోవైపు అప్రమత్తమైన అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
ఆకస్మిక వరదలకు పలు ఇళ్లు కొట్టుకుపోయాయి. అనేక మంది గల్లంతయ్యారు. రుయిడోసో నది 20 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ప్రవహిస్తోంది. అప్రమత్తమైన అధికారులు రుయిడోసో గ్రామంలోని ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రుయిడోసోలో సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
- Advertisement -