Friday, September 12, 2025
E-PAPER
Homeతాజా వార్తలుశ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం..

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో 16 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 80 వేల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 78,812 క్యూసెక్కులుగా ఉంది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు 16 గేట్ల ద్వారా 49,280 క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 6,500 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 1,500 క్యూసెక్కులు, ఇందిరమ్మ వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1090.8 అడుగులకు చేరుకుంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 79.65 టీఎంసీలుగా నమోదైంది

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -