- Advertisement -
నవతెలంగాణ-గండీడ్
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాల మైదానం గురువారం ముంపునకుగురైంది. మైదానంలో నీరు నిలిచిపోవడంతో ఆ ప్రాంతం చెరువును తలపించింది. వర్షపు నీరు బయటికి వెళ్లే మార్గం లేకపోగా,విద్యార్థినిలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.వరద నీటి కారణంగా విద్యార్థినిలకు ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.రెండు రోజుల క్రితం ఉన్నతాధికారులు పరిశీలించిన ఎలాంటి ఫలితం లేదంటున్నారు.
- Advertisement -