నవతెలంగాణ-హైదరాబాద్: బిహార్‌లో డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ గప్పాలు కొంటే ఎన్డీయే కూటమి పాలన డొల్లతనం మరోసారి బయటపడింది. నితిష్ కుమార్ ప్రభుత్వం ఎన్నికల వేళ పలు ఉచిత పథకాలు ప్రవేశపెడుతూ..ఓటర్లను ఆకర్షించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. తమ పాలనలో బిహార్ రాష్ట్రం నలు దిశల అభివృద్ధి చెందిందని ప్రచార్భాటాలు పలికే సీఎం, పీఎం మోడీ వ్యాఖ్యలు వట్టి మాటలే అని రుజువు అయ్యాయి. ఇటీవల కొన్ని రోజులుగా బీహార్ లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు జలమైయ్యాయి. ఆ రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణం ముందు భారీస్తాయిలో నీరు నిలిచింది. అంతే కాకుండా పాట్నా రైల్వే స్టేషన్ కూడా నీటితో నిండిపోయింది. నితిష్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి.
మరోవైపు వాతావరణ శాఖ సోమవారం విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం, 24 గంటల్లో నవాడా జిల్లాలో అతి భారీ వర్షాలు, ముజఫర్‌పూర్, భాగల్పూర్, పాట్నా, వైశాలి, బెగుసరాయ్ ముంగేర్‌లలో భారీ వర్షాలు, రాష్ట్రంలోని అనేక చోట్ల తేలికపాటి నుండి మితమైన వర్షాలు నమోదయ్యాయి. జూలై 28-29 తేదీలలో రాష్ట్రంలోని పాట్నా, నవాడా, నలంద, రోహ్తాస్, బక్సర్, కైమూర్ జిల్లాల్లోని కొన్ని చోట్ల ‘అతి భారీ’ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.