- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో రైలు పట్టాలపైకి వరద నీరు చేరింది. డోర్నకల్ రైల్వేస్టేషన్‌లో పట్టాల పైనుంచి వరదనీరు ప్రవహిస్తుండటంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. డోర్నకల్ రైల్వేస్టేషన్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్, మహబూబాబాద్‌లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లను అధికారులు నిలిపివేశారు.
- Advertisement -



