Thursday, October 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నీట మునిగిన పంట.. పట్టించుకోని ప్రభుత్వం

నీట మునిగిన పంట.. పట్టించుకోని ప్రభుత్వం

- Advertisement -

నవతెలంగాణ – బచ్చన్నపేట
భారీ వర్షాలు కురుస్తూ వరి ధాన్యం నీటిపాలైతున్నా ప్రభుత్వానికి మాత్రం చీమకుట్టినట్టు కూడా లేకుండా పోతుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించక, ధాన్యాన్ని కొనుగోలు చేయక రైతులను అధోగతి పట్టిస్తున్నారు. కొనుగోలు కేంద్రానికి వారం రోజుల క్రితం వరి ధాన్యం తీసుకువచ్చిన దానిని తూకం వేసి కొనే నాథుడే లేకుండా పోయాడు. రెండు రోజుల క్రితం నుంచి కురిసిన వర్షానికి వరి ధాన్యం తడిసిపోగా, మళ్లీ బుధవారం ఉదయం నుంచి రాత్రి కురిసిన భారీ వర్షానికి తడిసి ముద్దయ్యాయి.

బచ్చన్నపేట మండలంలోని గ్రామాలలో ఐకెపి మరియు పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అధికారులు, సిబ్బంది రైతులు పండించిన వడ్ల గురించి శ్రద్ధ వహించక పోవడంతో మాచర్ వచ్చిన తూకం వేయకపోవడంతో తుఫాను దెబ్బతో వడ్లు అన్ని కొట్టుకుపోవడంతో పాటు టార్ఫిన్ పరదాలు రైతులకు సకాలంలో అందజేయకపోవడంతో వడ్ల కుప్పలు తడిచిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి బచ్చన్నపేట మండలంలోని అన్ని గ్రామాల ఐకెపి పిఎసి సెంటర్లలో వారం రోజుల నుంచి వచ్చిన మ్యాచర్ వడ్లను వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని కోరారు.

కేశిరెడ్డి పల్లె ఐకెపి సెంటర్లో నిన్నటి వర్షం వల్ల ఎండిన వరి ధాన్యం తడిసి ముద్దయి వచ్చిన మ్యాచరు కూడా పోయింది. ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని కూడా వెంటనే కాంటాలు చేయించి వెంటనే వరి ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు వెంటనే తరలించాలని ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు. గత నెల 13 నుంచి ఐకెపి మరియు పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి నేటి వరకు కొనుగోలు జరపకపోవడం శోచనీయమని రైతులు వాపోయారు. వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు కోసిన ధాన్యాన్ని కేంద్రానికి తీసుకురావడం జరిగింది.

కేంద్రానికి తీసుకువచ్చి వారం రోజులు గడుస్తున్న అధికారులు, సిబ్బంది కొనుగోలు చేయడమే కాదు కనీసం తూకాలు కూడా ఏర్పాటు చేయలేదు. అకాల వర్షాలను దృష్టిలో పెట్టుకుని కనీసం టార్పాలిన్లను పంపిణీ చేయడంలో కూడా విఫలమయ్యారు. మొంథా తుఫానుకు కురిసిన భారీ వర్షాలకు రైతులు తీసుకువచ్చిన వారి ధాన్యం పూర్తిగా నీటిపాలైంది. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాల నుంచి వెంటనే వడ్లను రైస్ మిల్ కు తరలించే ప్రక్రియ ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -