నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తరాఖండ్‌లోని క్లౌడ్ బరస్ట్ సృష్టించిన విలయ తాండవం విషయం తెలిసిందే. తాజాగా వరద బురదలో చిక్కుకున్న బాధితులను రక్షించడానికి భారత్ ఆర్మీ రంగంలోకి దిగింది. బాధితులను రక్షించే క్రమంలో మరోసారి భారీ బురద వరద బీభత్సవం సృష్టించింది. ఈ ఆకస్మీకంగా పొటెత్తిన వరదలకు 9మంది జవాన్లు గల్లంతు అయినట్లు అధికారులు వెల్లడించారు. వారి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ముంపు గ్రామమైనా ధారాలికి సమీపంలో ఆర్మీ అధికారులు క్యాంపు ఏర్పాటు చేశారు.
“పరిస్థితి నిరంతర పర్యవేక్షణలో ఉంది, బాధిత పౌరులకు సాధ్యమైన అన్ని సహాయం అందించడానికి భారత సైన్యం పూర్తిగా కట్టుబడి ఉంది” అని సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది.