నవతెలంగాణ-హైదరాబాద్: ఆగ్నేయ బ్రెజిల్‌లోని మంగళవారం బురద వరద బీభత్సం సృష్టించింది.మినాస్ గెరైస్ రాష్ట్రంలోని జుయిజ్ డి ఫోరాలోని బారియో పార్క్ జార్డిమ్ బర్నియర్ పరిసరాల్లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి పడ్డాయి. దీంతో ఒక్కసారిగా కొండలపై ఉన్న మట్టి.. వాన నీరుతో కలిసి లోతట్టు ప్రాంతాలపై ఉవ్వెత్తున ఎగిసిపడింది. వరద ధాటికి 30మంది మృతి చెందగా, వందకుపైగా ఇండ్లు కొట్టుకుపోగా, 39మంది గల్లంతు అయ్యారు. అనేక మంది నివాసాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న విపత్తు దళం సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ముమ్మరం చేసింది. శిథిలాల కింద బురద వరదలో చిక్కుకున్న బాధితులను వెలికితీస్తున్నారు. గాయాలైన బాధితులను వైద్య శిబిరాలకు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం రాత్రి సమయంలో సంభవించడంతో అనేక మంది నివాసితులు వరదలో చిక్కుకున్నారని, దాదాపు 3వేల మంది ఇండ్లల్లో ఉండిపోయారు Juiz de Fora మేయర్, Margarida Salomao చెప్పారు.
‘వరద బాధితులకు అండగా ఉంటామని, సత్వర సాయం కింద మానవతా సహాయం, ప్రాథమిక సేవల పునరుద్ధరణ, నిర్వాసితులకు సహాయం, పునర్నిర్మాణానికి మద్దతు ఇవ్వడం మా దృష్టి’ అని సోషల్ మీడియా ఎక్స్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా రాసుకొచ్చారు.



