- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ఈ క్రమంలో సాగర్ 26 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేశారు. దీంతో కృష్ణమ్మ ఆంధ్రా వైపు పరుగులు పెడుతుతోంది. సాగర్ జలాశయం ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 2,58,272 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 587.40 అడుగులుగా ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 305.74 టీఎంసీలుగా ఉంది.
- Advertisement -